Friday, November 15, 2024

75ఏళ్లుగా దగాపడ్డ రైతన్న

- Advertisement -
- Advertisement -

‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందుబాటులో ఉన్న నీరు, విద్యుత్తునైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నారు’ అని 75ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను బిఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. కేంద్ర పాలకులను ఈ దిశగా నిలదీసే ప్రతీ దేశ పౌరుడు జాగృతం కావాల్సిన అవసరమున్నద ని పునరుద్ఘాటించారు. బుధవారం నాడు మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వందలాది మంది నేతలు కార్యకర్తలు పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఒకవైపు మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతుండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చేరికలు ఊపందుకున్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ మాట్లాడుతూ….75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశం లో రైతులు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు, విద్యుత్తు నేటికీ అందట్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్య ధోరణులు ఇంకా కొనసాగకుండా దేశ ప్రజలను జా గృతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై వున్నద ని పునరుద్ఘాటించారు. తెలంగాణలో అన్ని రంగా ల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నపుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని సిఎం ప్రశ్నించారు. కేంద్రాన్నేలుతున్న పాలకులకు చిత్తశుద్దిలోపం వల్లనే ప్రజలకు నష్టం జరుగుతున్నదని విమర్శించారు. “మనమేమన్నా వాల్లను చంద్రున్ని సుక్కలు తెచ్చి ఇమ్మంటున్నమా…?” …మన జీవితానికి అత్యవసరమైన, మనకు ప్రకృతి అందుబాటులో వుంచిన, తాగునీటిని, సాగునీటిని, విద్యుత్‌ను మా త్రమే ఇవ్వమని అడుగుతున్నం” అని పేర్కొన్నారు. “చాంద్ సితారో చోడో….పానీ బిజిలీ జోడో” (చాంద్ సితారలను వదిలేయండి …మాకు నీళ్లు, విద్యుత్తును అందించండి) అని కేంద్ర ప్రభుత్వాలకు సిఎం కెసిఆర్ చురకలంటించారు.

మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలకు చెందిన యాభై మంది సర్పంచులు బుధవారం నాడు బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారు పార్టీలో చేరడానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, విద్యుత్, రోడ్లు సహా పలు రంగాల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారు పరిశీలించారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు, దళితబంధు సహా రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. తమ తమ గ్రామా ల్లో కూడా తెలంగాణ మోడల్ పాలన అమ లు కావాలనే ధృఢమైన ఆంకాంక్షతో వారు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు తెలిపారు.

మధ్యప్రదేశ్ నుంచి చేరికలు
బిఆర్‌ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆ రాష్ట్రంలో సంచలనం రేపిన వ్యాపమ్ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చిన ఆనంద్ రాయ్ బుధవారం ప్రగతిభవన్‌లో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంనద్ రాయ్ ఆర్‌టిఐ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్టుగా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. సామాజిక కార్యకర్తగా ఆయనకు ప్రజల్లో మంచి పట్టు ఉన్నది. మధ్యప్రదేశ్‌లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (జెఎవైఎస్) అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది మధ్యప్రదేశ్‌లో ఆదివాసి, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ సంస్థ. ఆనంద్ రాయ్ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు జెఎవైఎస్ ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మన్, పంచం భీల్, అశ్విన్ దూబె, గాజీరామ్ బడోలే, కైలాశ్ రాణా తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జై ఆదివాసి యువజన శక్తి…వ్యవస్తాపకుడు విక్రమ్ అచ్చాలియ తమ ఆత్మగౌరవం ఐక్యతకు ప్రతీక అయిన సంస్థ జెండాను సిఎం కెసిఆర్ కు కప్పారు. సిఎం పాలనలో సంక్షేమ, అభివృద్ధి మానవీయ కోణంతో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల అభివృద్దే ధ్యేయంగా కొనసాగుతున్నాయని జెఎవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌కు తమ జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (జెఎవైఎస్) సం పూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News