Sunday, December 22, 2024

దేవుడి ముందు గొంతు కోసుకొని ప్రాణార్పణం చేసిన భక్తుడు

- Advertisement -
- Advertisement -

భోపాల్: శారదా మాతా ఆలయంలో ఓ భక్తులు గొంతుకోసుకొని ప్రాణార్పణం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం మహర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన లల్లారామ్ (37) అనే వ్యక్తికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. సోమవారం రాత్రి రామ్ మహర్ జిల్లా కేంద్రంలోని శారదా మాతా ఆలయానికి చేరుకున్నాడు. రాత్రి సమయంలో దేవుడు ముందు గొంతు కోసుకొని బలి ఇచ్చుకున్నాడు. ఆలయంలో ఓ వ్యక్తి రక్తపుమడుగులో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కత్తి కొంచెం దూరంలో పడడంతో పాటు అక్కడ హత్య చేసినట్లు అనవాళ్ల కనిపించకపోవడంతో దేవుడు ముందు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నరారు. గతంలో ఇదే ఆలయంలో భక్తులు నాలుక కోసుకున్న సందర్భాలు ఉన్నాయని స్థానికులు వెల్లడించారు. ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తున్నారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News