Saturday, January 4, 2025

కదులుతున్న అంబులెన్స్‌లో బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భోపాల్: కదులుతున్న అంబులెన్స్‌లో బాలికపై అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌగంజ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ బాలిక తన సోదరి, సోదరుడితో అంబులెన్స్‌లో ప్రయాణిస్తోంది.అప్పటికే డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది స్నేహితుడు రాజేష్ కేవత్‌లు అంబులెన్స్‌లో ఉన్నారు. నీళ్ల కోసం బాలిక సోదరి, సోదరుడు అంబులెన్స్ నుంచి కిందకు దిగారు. అంబులెన్స్ డ్రైవర్ వెంటనే వారి కోసం ఎదురుచూడకండా వాహనాన్ని నడిపాడు.

కదులుతున్న అంబులెన్స్‌లో బాలికపై రాజేష్ కేవత్ అత్యాచారం చేశాడు. అనంతరం రోడ్డు పక్కన బాలికను వదిలేసి పారిపోయారు. వెంటనే బాలిక తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికి కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మూడు రోజుల తరువాత తల్లి, తన కూతురుతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేవత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News