Monday, December 23, 2024

ఎంపి మైనర్ బాలికపై పెద్దపల్లిలో సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెద్దజిల్లాలోని అప్పన్నపేట్ గురువారం దారుణం చోటుచేసుకుంది. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ 15ఏళ్ల మైనర్ బాలికపై సాముహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి మృతిచెందింది. యువతి కుటుంబం బతుకుదేరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణలోని పెద్దపల్లికి వచ్చి ఇటుక బట్టీలో పని చేసేందుకు వలస వచ్చింది. ఆమె తల్లిదండ్రులు దినసరికూలీలు. ఈ దారుణ ఘటన రెండు రోజుల క్రితం జరిగినప్పటికీ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గురువారం మాత్రమే వెలుగులోకి వచ్చింది.

యువతిపై రెండ్రోజుల క్రితం పెద్దపల్లి శివారులో నలుగురు హత్యచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. విషయం బయటకు రాకుండా తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ లో బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News