Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో ఐదుగురు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటెలిజెన్స్ బ్యూరో, మధ్యప్రదేశ్ పోలీసులు, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ మంగళవారం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున భోపాల్ నుండి 11 మందిని, హైదరాబాద్ నుండి 5 మందిని…మొత్తం 16 మందిని నిర్భందంలోకి తీసుకున్నారు.‘ ఈ మాడ్యూల్ గత 18 నెలలుగా రాడికల్ ఇస్లామిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దృష్టికి వచ్చింది’ అని అధికార వర్గాలు తెలిపాయి.

దాడుల సందర్భంగా వారి నుంచి డిజిటల్ పరికరాలు(మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్లోరేజి మీడియా), ఇస్లామిక్ జిహాదీ సాహిత్యం, కత్తులు, బాకులు, ఎయిర్‌గన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఏటిఎస్ మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం భోపాల్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News