Sunday, January 19, 2025

కుక్కల మొరగమన్నందుకు ముగ్గురిపై కఠినాస్త్రం

- Advertisement -
- Advertisement -

భోపాల్ : కుక్కలా మొరగాలని ఓ వ్యక్తిని పురమాయించిన ముగ్గురు వ్యక్తులపై మధ్యప్రదేశ్‌లో కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ)ను ప్రయోగించారు. ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్టు చేశారు. వారి ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చివేయాలని , ఇతరత్రా కఠినమైన చర్యలుతీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. దీని తరువాత అధికారులు వీరిని ఎన్‌ఎస్‌ఎ పరిధిలో నిర్బంధించారు. తోటి వ్యక్తి పట్ల ఇంతటి అమానుషంగా వ్యవహరించిన వారికి తగు శిక్ష అత్యవసరం అని ఇందులో ఎటువంటి రాజీ ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News