భోపాల్: పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా పెళ్లి బృందంపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రైజిన్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం హోసంగాబాద్‌లో పెళ్లి జరిగిన తరువాత రైజిన్ జిల్లాలోని సుల్తాన్‌పూర్ ప్రాంతానిక చేరుకున్నారు. వధువు, వరుడిని ఊరేగింపు చేస్తుండగా వారి పైకి ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇస్తామని పేర్కొన్నారు.
పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు: ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -