Sunday, January 19, 2025

తమ్ముడు ఆత్మహత్య… మరదలిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు….

- Advertisement -
- Advertisement -

భోపాల్: తమ్ముడి చావుకు మరదలు కారణం కావడంతో ఆమెపై సోదరుడు పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రత్లాం జిల్లాలో ప్రకాశ్- నిర్మల అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం ప్రకాశ్ అత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న సురేష్ తన మరదలును వేధిస్తున్నారు. తన తమ్ముడి చావుకు నిర్మలే కారణమని ఆరోపణలు చేస్తూ వేధించాడు. తన మరదలపై సురేష్ రాడ్డుతో దాడి చేసి అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఫోన్ చేసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన కుమార్తెను పుట్టింటికి తీసుకొందామని నిర్ణయం తీసుకునేలోపే ఈ దారుణం జరిగిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News