Wednesday, January 22, 2025

నవ వధువు ఆత్మహత్య….. అత్తింటి వారిపై కేసు నమోదు… విచారణలో విస్తుగొలిపే విషయాలు…

- Advertisement -
- Advertisement -

పెళ్లి జరిగిన వారం రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడంతో, పోలీసులు అత్తింటి వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడడంతో అత్తింటి వారిని వదిలేసి యువతిని మానసికంగా వేధించిన మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చాంద్‌పూర్ గ్రామంలో ఓ యువతి యువకుడిని వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన వారం రోజులకే యువతి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు అత్తింటి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. సదరు యువతికి పెళ్లికి ముందు ప్రమోద్ అహిర్వార్ అనే యువకుడితో ప్రేమాయణం నడిపించింది. యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకున్న తరువాత ప్రమోద్ ఆమెను పలుమార్లు వేధించాడు. భర్తను వదిలేసి రావాలని లేకపోతే చంపేస్తానని, అత్తింటి వారిని కూడా చంపేస్తానని బెదిరించాడు. ప్రమోద్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో సాయంత్రం తన రూమ్ తో ఉరేసుకొని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ప్రమోద్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News