Wednesday, January 1, 2025

దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపిన సర్పంచ్

- Advertisement -
- Advertisement -

భోపాల్: బోరు విషయంలో గొడవ జరగడంతో దళిత యువకుడిని సర్పంచ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కొట్టి చంపిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గ్వాలియర్‌కు చెందిన నారద్ జాతవ్ తన మేనమామ ఊరు ఇందర్‌గఢ్‌కు వచ్చాడు. మంగళవారం సాయంత్ర తన మేనమామ పొలానికి వెళ్లి బోర్ పైప్ పీకి పొలానికి నీళ్లు మళ్లించాడు. అదే సమయంలో సర్పంచ్ పదమ్ ధకడ్, తన కుటుంబ సభ్యులు మోహర్ పాల్ దకడ్, అంకేశ్ దకడ్, దఖా బాయ్ దకడ్, విమల్ దకడ్ కలిసి నారద్‌తో గొడవకు దిగాడు. వెంటనే కర్రలు తీసుకొని నారద్‌పై విచకణ రహితంగా దాడి చేయడంతో కుప్పకూలిపోయాడు.

వెంటనే అతడిని శివపూరి మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నారద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేశ ప్రజలు డా బి ఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుండగా అగ్ర కులాలు చెందిన వ్యక్తులు దళితుడిని కొట్టి చంపారని కాంగ్రెస్ ఎంపి ట్వీట్ చేశారు. బిజెపి పాలనలో దళితులపై దోపిడీ, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిందని మండిపడ్డారు. బోరు ఉన్న ప్రాంతం నారద్ తల్లి పేరు మీద ఉందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News