Wednesday, January 8, 2025

సెప్టిక్ ట్యాంక్‌లో నాలుగు మృతదేహాలు… చంపారా?

- Advertisement -
- Advertisement -

భోపాల్: సెప్టిక్ ట్యాంక్‌లో నాలుగు మృతదేహాలు కనిపించిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బర్గావాన్ ప్రాంతంలో హరి ప్రసాద్ ప్రజాపతికి స్వంత ఇల్లు ఉంది. ఇంట్లో నుంచి రెండు రోజుల క్రితం దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సెప్టిక్ ట్యాంక్‌లో పరిశీలించగా నాలుగు మృతదేహాలు కనిపించాయి.

ఒక మృతదేహం హరిప్రసాద్ కుమారుడు సురేష్ ప్రజాపతిది కాగా మరో మృతదేహం కరణ్ హల్వాయిదిగా గుర్తించారు. జనవరి 1న సురేష్ తన స్నేహితులతో కలిసి సురేష్ మద్యం పార్టీ జరుపుకున్నట్టు ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఇంకా ఇద్దరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానికుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం ఫుల్‌గా తాగి సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయారా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాగిన మత్తులో ఒకరు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోతే… మిగిలిన ముగ్గురు రక్షించడానికి వెళ్లి చనిపోయి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News