Tuesday, February 11, 2025

కుంభమేళా నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదం… ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఏడుగురు మృతి చెందారు ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో నాచారానికి చెందిన భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లారు. భక్తులు ప్రయాగ్ రాజ్ నుంచి తిరిగి వస్తుండగా జబల్‌పూర్‌లోని సిహోరా గ్రామ శివారులో రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ, మినీ బస్సుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వాహనం నంబర్ ఎపి 29 డబ్లు 1525గా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ తొలుత పోలీసులు భావించారు. బాధితుల వద్ద గల ఆధార్ కార్డుతో నాచారం వాసులుగా గుర్తించారు. మృతులు, క్షతగాత్రులు పేర్లు ఇంకా వెల్లడింలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News