Saturday, December 21, 2024

రూ. 6 కోట్ల భరణం కోసం భర్తకు బెదిరింపులు: భార్యపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే రూ. 6 కోట్ల భరణం కోసం భర్తపై బెదిరింపులకు పాల్పడిన ఒక మహిళపై మధ్యప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తన భార్య తనను డబ్బు కోసం బెదిరిస్తోందంటూ ఒక భర్త తన భార్యపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. వారిద్దరి మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని ఆయన చెప్పారు.

ఇండోర్‌లోని భన్వర్‌కువా పోలీసు స్టేషన్‌కు చెందిన డిసిపి రాఏష్ సింగ్ కథనం ప్రకారం&భన్వర్‌కువా పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే రామ్ రాజ్‌పుత్ లలిత్‌పూర్‌లో నివసించే తన భార్యపై ఫిర్యాదు చేశాడని తెలిపారు. రూ. 6 కోట్లు భరణంగా ఇవ్వాలంటూ తన భార్య తనను బెదిరిస్తోందంటూ రామ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని ఆయన చెప్పారు.

వాళ్లిద్దరూ విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని, ఆ కేసు నడుస్తుండగానే ఆమె బెదిరింపులకు పాఅల్పడిందని ఆయన చెప్పారు. భర్తను బెదిరించిన ఆ మహిళపై ఐపిసిలోని 384, 507, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News