Thursday, November 7, 2024

చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్… తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి జైస్వాల్ (78), కెప్టెన్ పృథ్వీ షా(47) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మధ్యప్రదేశ్‌కు యష్ దూబే (133) అదిరిపోయే ఆరంభం అందించాడు. శుభమ్ శర్మ (116), రజత్ పటీదార్ (122) కూడా బ్యాటు ఝుళిపించారు. చివర్లో శరన్ష్ జైన్(57) కూడా రాణించడంతో ఎంపి 536 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కుమార కార్తికేయ నాలుగు వికెట్లతో చెలరేగడంతో ముంబై కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఎంపి ఆటగాడు హిమాన్షు మంత్రి మంచి ఆరంభమే ఇచ్చినా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో మరోసారి రజత్ పటీదార్ జట్టును ఆదుకున్నాడు. 30వ ఓవర్లో విన్నింగ్ రన్స్ చేసి తమ జట్టుకు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించాడు.

Madhya Pradesh won Ranji Trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News