Wednesday, January 22, 2025

మధ్యప్రదేశ్ సిఎం తప్పులో కాలు

- Advertisement -
- Advertisement -

ఇటీవల బాధిత గిరిజన యువకుడికి బదులు మరో వ్యక్తికి పాద పూజ
దళిత గిరిజనుల పట్ల కపట ప్రేమను ప్రదర్శించేందుకే శివరాజ్ సింగ్ ఆరాటపడ్డారని విపక్షం విమర్శలు

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజన యువకుడి కాళ్లు కడిగి, క్షమాపణలు కోరిన ఘటన మరో మలుపు చోటుచేసుకుంది. సిద్ధి జిల్లాలో దష్మత్ రావత్ అనే గిరిజనుడిపై ప్రవేశ్‌శుక్లా అనే పెద్దాయన మూత్రవిసర్జన చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. రాష్ట్రంలో దళితులకు, పేదలకు రక్షణ లేదని, వారిపై అగ్రవర్ణాల జులుం ఈ బిజెపి పాలిత రాష్ట్రాలలో సాగుతోందనే విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సిఎం స్పందించి బాధిత యువకుడిని వెతికి పాద ప్రక్షాళన చేశాడు. పాపం జరిగింది, క్షమించాలని వేడుకున్నారు. సాయం చేస్తామని తెలిపారు. ఘటనలో నిందితుడి ఇంటిని కూల్చేయించారు. అయితే సిఎం హడావిడిగా కాళ్లు కడిగిన వ్యక్తి నిజానికి ఆ బాధిత గిరిజన యువకుడు కాదని, వేరే వ్యక్తి అని విమర్శలు తలెత్తాయి. దళితుల పట్ల కపట ప్రేమను చాటుకునేందుకు సిఎం హంగామాతో వేరే యువకుడిని పట్టుకొచ్చి కాళ్లు కడిగినట్లు, తమది దళిత, గిరిజన పక్షపాత ప్రభుత్వం అని తెలియచేసుకోవడానికి చేసిన పని అని, తను దష్మత్‌ను కాదని, వేరే వ్యక్తిని అని, చెప్పినా వినలేదని ఇదంతా కూడా పాప ప్రక్షాళార్థం చేసిన మరో పాప కార్యం అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తనను సిఎం ఎందుకు పిలిపించారో తన కాళ్లు ఎందుకు కడిగారో తెలియని స్థితిలో జరుగుతున్నది కలయో నిజమో తెలియక కొట్టుమిట్టాడటం ఇప్పుడు ఈ కాళ్లు కడిగించుకున్న వ్యక్తి వంతయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News