Wednesday, January 29, 2025

మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కుట్రకోణం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం వెనుక కుట్ర కోణం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఇరిగేషన్ అధికారులు మహదేవ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్ధం రావడంతో కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మంపదు పిల్లర్లు కుంగడంపై కుట్ర ఉందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు ప్రత్యేక టీమ్స్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News