Wednesday, January 22, 2025

మాదిగలు బిజెపి గెలుపుకు కృషిచేయాలి : మందకృష్ణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలోనే జరుగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషిచేయాలని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం ప్రెస్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ విషయంలో బిఅర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమను ఏళ్ల తరబడి మోసం చేశాయని అందుకే స్పష్టమైన హామీ ఇచ్చిన మోడీ అధ్వర్యం లోని బిజెపికి మద్దతు నివ్వాలని మంద కృష్ణ కోరారు. బిసిని ముఖ్యమంత్రిగా చూడాలనేది బిసిలు ఎదురుచూస్తున్నారని ఆయనన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటివరకు మాదిగలు చేసిన ప్రతి పోరాటంలో అత్యంత నమ్మకంగా మాదిగల వైపు నిలబడ్డారని ఆయనన్నారు. బిజెపి మ్యానిఫెస్టోలో బిసిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిందని, బిసి బిడ్డలంతా ఈ విషయం గమనించి తమ ఓటును వినియోగించు కోవాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News