- Advertisement -
తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె పొన్ముడిపై పోలీసు కేసు దాఖలు చేయాలని మద్రాసు హైకోర్టు గురువారం పోలీసు విభాగాన్ని ఆదేశించింది. ఒక బహిరంగ సభలో ఇటీవల మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సెక్స్ దర్కర్ల ఇతివృత్తంతో ఆయన శివతత్వం వైష్ణవతత్వం గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. దీనిపై సొంత పార్టీ ఎంపి కనిమొళి సహా పలువురు నేతలు, సంస్థలు మంత్రిపై విరుచుకుపడ్డాయి.ఆయన రాద్ధాంతం నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. ఆయనను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తీసివేశారు. సీనియర్ నేత క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయనపై వివాదం రగులుకుంటూనే ఉంది. ఈ కేసులో మంత్రి కోర్టుకు హాజరు కావల్సి ఉంటుంది. తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీన ఉంటుంది.
- Advertisement -