Saturday, November 16, 2024

తమిళనాడు గుళ్లలో మొబైల్ ఫోన్ల నిషేధం!

- Advertisement -
- Advertisement -

చెన్నై: మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్రం అంతటా గుళ్లలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకుండా నిషేధం విధించింది. కొలిచే దైవ మందిరాలలో పవిత్రత, పరిశుద్ధతను కాపాడేందుకే ఈ నిషేధం విధించింది. అయితే ప్రజల అసౌకర్యాన్ని నివారించేందుకుగాను గుళ్ల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.

సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఫోన్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన వినతిని పరిశీలించిన కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మొబైల్ ఫోన్లు ప్రజల ధ్యానాన్ని దెబ్బతీస్తున్నాయని, గుడిలోని దేవతా విగ్రహాలను ఫోటో తీయడం అగమ శాస్త్ర నియమాలకు విరుద్ధం అని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టుకు విన్నవించుకున్నాడు. ఫోటోలు తీయడం గుళ్ల రక్షణకే ముప్పు కాక, గుళ్లకు వచ్చే మహిళల ఫోటోలు వారి అనుమతి లేకుండా తీయడానికి తావిస్తాయని వాదించాడు. అంతేకాక గుళ్లకు వచ్చే వారు మందిర మర్యాదకు అనుగుణంగా దుస్తులు ధరించేలా(డ్రెస్ కోడ్) ఆదేశించాలని కోరాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News