Monday, January 6, 2025

మద్రాస్ హైకోర్టులో తమిళ సినీ నిర్మాతల మండలికి ఎదురు దెబ్బ!

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో సమీక్షలపై(రివ్యూలపై) వివాదం కొనసాగుతోంది. సినిమా విడుదల రోజే థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకుని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని నిర్మాతల మండలి గత కొన్ని రోజులుగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాక మండలి తరఫున ఏకపక్ష నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే దీనిపై మద్రాసస్ హైకోర్టు ఇప్పుడు సదరు నిర్మాతల మండలికి షాకిచ్చింది.

ఇటీవల వచ్చిన ‘కంగువ’ సినిమాతో రివ్యూలపై నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. తొలిరోజు థియేటర్ల దగ్గర రివ్యూలు చేపట్టకూడదంటూ యూట్యూబర్లని నిషేధించాలని తీర్మానించింది. థియేటర్ల యజమానులు ఈ విషయంలో సహకరించాలని కోరింది. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు.

అయితే దీనిపై కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు నిర్మాతల మండలి నిర్ణయాన్ని తిరస్కరించింది.  రివ్యూలు ఉద్దేశపూర్వకంగా, నష్టం కలిగించే విధంగా, తప్పుడు విధానంగా ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్పితే…రివ్యూయే ఇవ్వొద్దని చెపొద్దని తెలిపింది. పైగా రివ్యూలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. రివ్యూల మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్స్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News