Friday, January 17, 2025

నటి కస్తూరి ముందస్తు బెయిలు తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మద్రాస్: నోరుంది కదా అని నిరాధారంగా ఏదేదో వాగేసిన నటి, బిజెపి నాయకురాలు కస్తూరి కి మద్రాస్ హైకోర్టు గురువారం ముందస్తు జామీను తోసిపుచ్చింది. సింగిల్ జడ్జీ బెంచ్ న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్ గురువారం ఆమె ముందస్తు బెయిల్ వినతిని కొట్టిపారేశారు.

నటి, బిజెపి నాయకురాలు నవంబర్ 3న కావాలని తెలుగువారిని తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. తమిళ రాజులకు తెలుగువారు సేవలు చేయడానికి వచ్చారని, అలాంటి వారు నేడు తాము తమిళులం అని చెప్పుకుంటున్నారని అన్నారు. తర్వాత ఆమె ఇప్పుడు మాటా మారుస్తున్నారు. ఆమెపై తిరునగర్ పోలీసులు భారత నీతి సంహిత లోని 196(1)(ఏ), 197(1)(సి), 296(బి), 352, 353(3), అలాగే ఐటి చట్టం 67 సెక్షన్ కింద కేసు రిజిష్టరు చేశారు.

ఇదిలావుండగా విచారణ సదర్భంలో న్యాయమూర్తి తెలుగు ఆడపడచులపట్ల ఆమె చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని వ్యాఖ్యానించారు. కాగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కరన్ ఆమె ముందస్తు జామీనును వ్యతిరేకిస్తూ తమిళనాడుకు కేరళ, కర్ణాటక తో సంబంధాలు గందరగోళంగా ఉన్నాయని, ఒకవేళ ఆమె వ్యాఖ్యలను కొనసాగనిస్తే ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సంబంధాలు దెబ్బతింటాయన్నారు. ఆమె అపరాధం చేసింది కనుక అవసరమైతే కస్టోడియల్ ఇంటరాగేషన్ కు అనుమంతించాలని, ఆమెకు ముందస్తు జామీను ఇవ్వకూడదని వాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News