లేడీ సూపర్ స్టార్ నయనతారకు చెన్నై హైకోర్టు షాకిచ్చింది. హీరో ధనుష్ వేసిన దావాను విచారించిన కోర్టు నయతారకు నోటీసులు ఇచ్చింది. ఇటీవల నయనతార జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ధనుష్ నిర్మాతగా విజయ్ సేతుపతి-నయనతార కాంబినేషన్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన మూవీలోని సీన్స్ ను ఎలా వాడుతారంటూ ధనుష్ మద్రాస్ హైకోర్టులో దావా వేశారు.
తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. జనవరి 8వ తేదీ లోపు దీనిపై వివరణ ఇవ్వాలని నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్, నెట్‌ఫ్లిక్స్‌కు కోర్టు ఆదేశించింది. అయితే, ఆ సన్నివేశాలకు పర్మిషన్ తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నించామని, కానీ ధనుష్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని.. అసలు మా మీద ఎందుకు ధ్వేషాన్ని పెంచుకున్నారో తెలియదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార చెప్పింది.