చెన్నై: “ఏడాదిన్నర కాలంపాటు మమల్ని నీటి కోసం దేబురించేలా చేసి, ఇప్పుడు నీటిలో మునిగి చచ్చేలా చేస్తోంది” అని మద్రాస్ హైకోర్టు మంగళవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌పై మండిపడింది. నగరం అంతా వాన నీటికి జలమై పోతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందని విమర్శించింది. 2015లో వచ్చిన వరదల తర్వాత నుంచి అధికారులు ఈ ఐదేళ్లలో ఏమి చేశారంటూ ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ, న్యాయమూర్తి పిడి ఆదికేశవులుతో కూడిన ఫస్ట్ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. పరిస్థితిని నియంత్రణలోకి తేకుంటే స్వయంగా కేసు చేపడతాం(సుమోటు) అని ధర్మాసనం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులను హెచ్చరించింది. తమిళనాడులో రోడ్లను తగినంత వెడల్పుగా ఉండేట్లు ప్రభుత్వం చూసేలా చేయమంటూ దాఖలైన పిల్‌ను విచారిస్తున్న సందర్భంగా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జలాశయాల కబ్జాలపై దాఖలైన మరో పిల్‌ను కూడా విచారించిన ధర్మాసనం “చెన్నై చట్టుపక్కల ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ అధికారులకు ఓ గుణపాఠం కావాలి. వారు జలాశయాల ప్రదేశాలను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి” అని అభిప్రాయపడింది.
చెన్నై కార్పొరేషన్‌పై మద్రాస్ హైకోర్టు మండిపాటు
- Advertisement -
- Advertisement -
- Advertisement -