ఉగ్ర లింక్‌లపై నియా విచారణ
సహ్రాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్) : కర్నాటకకు చెందిన స్థానిక మదర్సా విద్యార్థిని జాతీయ విద్యార్థి సంస్థ (నియా) ఆదివారం నిర్బంధంలోకి తీసుకుంది. ఉగ్రవాద లింక్‌లున్నాయనే అనుమానాలతో నియా వర్గాలు విద్యార్థి ఫరూక్ సహ్రాన్‌పూర్ జిల్లాలోని దియోబండ్‌లోఓ మదర్సాలో విద్యార్థిగా ఉన్నాడు. కీలక సమాచారం లభ్యం కావడంతో ఉగ్రవాద లింక్‌లున్నాయని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా సీనియర్ ఎస్‌పి విపిన్ టాడా నిర్థారించారు. పలు భాషలు తెలిసిన ఈ యువకుడు తరచూ సామాజిక మాధ్యమం వాడుతూ , పాకిస్థాన్ ఐఎస్‌ఐ అనుబంధ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడైంది. ఇతర వివరాలను తగు విచారణ ద్వారా రాబడుతారని పోలీసు అధికారి తెలిపారు. నియా వర్గాలు ఆయనను విచారిస్తున్నాయి. గత నెల 23వ తేదీన దియోబండ్‌లోనే రోహింగ్యా విద్యార్థి ముజిబుల్లాను ఉగ్రవాద లింక్‌లతో అరెస్టు చేశారు.