Monday, November 25, 2024

విమానంలో పెళ్లిపై డిజిసిఎ ఫైర్

- Advertisement -
- Advertisement -

Madurai couple gets married on SpiceJet plane

చెన్నై: విమానంలో వివాహం ఘటనపై డిజిసిఎ విచారణకు ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటించలేదన్న ఆరోపణపై అధికారులు విచారణ చేపట్టింది. కాగా, ఆదివారం తమిళనాడులోని మధురై నుంచి తూత్తుపూడి వెళ్లిన విమానంలో వివాహం జరిగింది. ఆ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులున్నారు. విమానంలో వధూవరులుతో పాటు కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఈ తంతు జరిగింది. ఓ జంట త‌మ వివాహ వేడుక‌ను వినూత్నంగా నిర్వ‌హించి వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్పాట్ లో వైర‌ల్ అయింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న డిజిసిఎ విమాన సిబ్బందిని సస్పెండ్ చేశారు. మదురై నుండి ఫ్లైట్ బుక్ చేయబడిందని విమానాశ్రయ డైరెక్టర్ చెప్పారు. అయితే, ఎటువంటి వివాహ వేడుక గురించి అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ వివాహాలను వాయిదా వేసుకుంటున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News