కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ మదురై హైకోర్టులో ఊరట లభించింది. కొన్నేళ్ల క్రితం ఓ వృద్ధ దంపతులు వేసిన కేసులో ఇరుక్కున్న సంగతి మనందరికీ తెలిసిందే. మదురైలోని మేలూర్‌కు చెందిన కదిరేసన్, మీనాక్షి దంపతులు 11వ తరగతిలో సినిమాల్లో నటించేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ కుమారుడంటూ కేసు పెట్టారు. వారు ధనుష్ నుండి నెలవారీ రూ.65,000 మెయింటెనెన్స్ డిమాండ్ చేశారు. హీరో ధనుష్ మాత్రం వాళ్లు తమ తల్లిదండ్రులు కాదని, కస్తూరి రాజా, విజయలక్ష్మీ తన అమ్మానాన్నలని, కేవలం డబ్బుల కోసమే కేసు పెట్టినట్లు పేర్కొన్నారు.
దీనిపై ధనుష్ తరపు న్యాయవాదులు స్పందించడంతో మేలూరు కోర్టులో దంపతులు వేసిన కేసును చెన్నై హైకోర్టు కొట్టివేసింది. నకిలీ పత్రాలను ఉపయోగించి నటుడు కేసును కొట్టివేశారని, మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని కార్తిరేసన్ పేర్కొన్నారు. దాదాపు 9 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేసు నడుస్తోంది. ఇప్పుడు ఈ కేసులో మధురై హైకోర్టు తీర్పు వెలువరించింది. పిటిషనర్ ఉద్దేశపూర్వకంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని, ఆరోపణలను నిరూపించడానికి సరైన సాక్ష్యాలను దాఖలు చేయడంలో కూడా విఫలమయ్యారని తీర్పు పేర్కొంది. న్యాయమూర్తి కేసును పనికిరానిదిగా కొట్టివేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.