- Advertisement -
చెన్నై: తమిళనాడులోని మధురైలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 9 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు రైలులో 63 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అగ్నిమాపక యంత్రాలు, రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేయడంతో పాటు ఆ బోగీ ఉన్న లింక్‌ను తొలగించారు. బోగీ పూర్తిగా దగ్ధమైంది. రైలులోని ఓ కోచ్‌లో ప్రైవేట్ పార్టీ టీ చేసుకునే క్రమంలో సిలిండర్ పేలినట్టు సమాచారం. రైలు కోచ్‌లోకి ప్రయాణికులు రహస్యంగా సిలిండర్ తీసుకొచ్చినట్టు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిలిండర్ రైలు ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అంగన్‌వాడీలకు తీపి కబురు
- Advertisement -