Wednesday, January 22, 2025

దళిత యువకుడిని కొడవళ్లతో నరికి…

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: దళిత యువకుడిని కోడవళ్లతో నరికి చంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతంలోని టెంకాసి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సింగొటాయ్ మున్సిపాలిటీలో రాజేశ్ అనే దళిత యువకుడు పని చేస్తున్నాడు. మర్రి(21), మంతిరామూర్తి(26) అనే యువకుడు బైక్‌పై రాజేష్ దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కొడవళ్లతో రాజేష్‌పై దాడి చేయడంతో కుప్పకూలిపోయాడు. రాజేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజేష్ మృతి చెందాడని తెలిపారు. దీంతో రాజేష్ బంధువులు కోల్లమ్-తిరుమంగళమ్ రోడ్డుపై ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. సింగొటాయ్‌లో అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతులు బంధువులు, దళితులు దాడి చేస్తారని తాము ఊహించలేదని డిజిపి శైలేంద్ర బాబు తెలిపాడు. బిసిలోని ఉప కులానికి చెందినవారు నిందితులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు చంపారు అనే వివరాలు ఇంకా తెలియలేదు.

Also Read: మావి కిట్లు.. ప్రతిపక్షాలవి తిట్లు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News