Monday, March 31, 2025

వేదికపైనే కుప్పకూలిన మంత్రి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌధరీ ఒక్కసారిగా వేదికపై కుప్పకూలారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరిస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు. అదే సమయంలో మౌగంజ్‌లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. స్పీకర్ గిరీశ్ గౌతమ్ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించడం ప్రారంభించారు. ప్రసంగం మధ్యలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News