- Advertisement -
భోపాల్ :మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినాటి నుంచి ఇప్పటి వరకూ వివిధ రూపాలలో మొత్తం మీద రూ 200 కోట్లు విలువైన సామాగ్రిని భద్రతా సంస్థలు పట్టుకున్నాయి. వీటిలో రూ 25 కోట్ల నగదు, లిక్కర్, డ్రగ్స్, నగలు ఇతర వస్తువులు ఉన్నాయని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు అనుపమ్ రాజన్ బుధవారం విలేకరులకు తెలిపారు. అక్టోబర్ 9వ తేదీన మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఓటర్లను ప్రలోభపెట్టే నగదు ఇతరత్రా కానుకలు పంపిణీ కాకుండా వివిధ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, రాష్ట్ర పోలీసు విభాగంతో కూడిన ప్రత్యేక సంయుక్త బృందాలు ఇప్పటివరకూ స్వాధీనపర్చుకున్న వస్తువులు ఇతరత్రా పదార్థాల విలువ రెండు వందల కోట్ల వరకూ ఉంటుందని రాజన్ తెలిపారు.
- Advertisement -