- Advertisement -
మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్లర్ మూవీ మగధీర రీరిలీజ్ కాబోతోంది. ఈ నెల 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను వదిలారు. దీంతో మెగా అభిమానులు థియేటర్లో రచ్చ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.
కాగా, 2009లో వచ్చి ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటివరకు ఉన్న అన్ని సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. చిరుత మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతోపాటు అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. రామ్ చరణ్ ను స్టార్ హీరో చేసింది ఈ సినిమా.
- Advertisement -