Friday, December 20, 2024

జెడి నేత రేవణ్ణకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : పనిమనిషిపై లైంగిక అత్యాచారం కేసులో కర్నాటక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులు వర్తిస్తాయని తెలిపింది. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు అయిన రేవణ్ణకు ఇంతకు ముందు స్థానిక 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. దీనిపై సిట్ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు యత్నించగా , ఇందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ ప్రీత్ జె బెయిల్‌కు ఆదేశాలు వెలువరించారు. కేసుకు సంబంధించి రేవణ్ణ ఈ నెల 4వ తేదీన అరెస్టు అయ్యాడు. నాలుగురోజుల పోలీసు కస్టడీ తరువాత జైలుకు పంపించారు. కాగా ఆయనకు ఎంపిలు/ఎమ్మెల్యేల సంబంధిత ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News