Monday, December 23, 2024

నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మాండమైన అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
  • 39వ డివిజన్‌లో రూ. 2.26 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం 39వ డివిజన్‌లో రూ. 2.62 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ. 4000 కోట్లతో అద్భుత ప్రగతి సాధిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌కి తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందని అందుకే మనకు అత్యధిక నిధులు కేటాయించారన్నారు. 39వ డివిజన్ ఏకశిల నగర్, కాశికుంట, విద్యానగర్, డివిజన్‌లోని అన్ని ప్రాంతాలను గొప్పగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల అభ్యున్నతి, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని అందుకే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచామన్నారు. కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి చేయడం చేతకాలేదని కాని ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నారని వారి తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. మరోమారు సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నానని తనను మరింత మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ సిద్ధం రాజు, డివిజన్ అధ్యక్షుడు బొరిగం నర్సింగం, కాలనీ అధ్యక్షులు గొర్రె చేరాలు, వంటల మల్లక్క, అచ్చ వినోద్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News