Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ ఆశీస్సులతో బ్రహ్మాండమైన అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆశీస్సులతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 38వ డివిజన్‌లో రూ. 49 లక్షలతో స్మశాన వాటిక పనులకు ఆదివారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. మాడిశెట్టి లక్ష్మీనర్సయ్య స్మారక స్తూపం, హనుమాన్ వీధి ఖిలా వరంగల్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ వారు ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 38వ డివిజన్‌లో సుమారు రూ. 70 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. నియోజకవర్గంలో రూ. 3800 కోట్లతో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మునుపెన్నడూ లేని విధంగా ఓరుగల్లు తూర్పు అభివృద్ధి వడి వడిగా అడుగులు వేస్తున్నామన్నారు. వాడ వాడన సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, విద్య, వైద్యంలో ముందంజలో ఉందని, పేదల మధ్య కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నామని, 24 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దసరాకు అందుబాటులోకి వస్తుందన్నారు.

నియోజకవర్గంలో ఏడు గురుకులాలు ఏర్పాటుచేసుకొని ఒక్కో విద్యార్థికి రూ. 1.20 లక్షలు వెచ్చించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమ దేవేందర్‌యాదవ్, డివిజన్ అధ్యక్షుడు మిట్టపల్లి కట్లమల్లు, ఇనుముల మల్లేశం, బొల్లం కార్తీక్, గజ్జెల శ్యామ్, సులుగం అశోక్, తీగల శ్రీధర్, పోశాల రవి, నల్లభీముల బిక్షపతి, మిట్టపల్లి లక్ష్మీ, దేవ రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News