Monday, December 23, 2024

వైభవంగా మహాంకాళీ అమ్మవారి బోనాలు

- Advertisement -
- Advertisement -
  • పోటెత్తిన భక్తులతో ఆలయ ప్రాంగణ పరిసరాలు

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం మహాంకాళీ అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని గ్రామాల నుంచే కాకుండా సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలయ పరిసరాలు, ప్రధాన ప్రాంగణం భక్తుతో పోటెత్తింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రెండో ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తున్న నేపధ్యంలో ఈ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించటానికి ఆలయ కమిటీ ఛైర్మన్ కాలువ శ్రీధర్ రావు ,భక్తమండలి సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున మహిళలు బోనాలతో ఆలయానికి రావటం, మరో వైపు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయటానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను వండి అలంకరించిన బోనాలను, దీపాలను తమ తలలపై పెటుట్కుని మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు చాడ నంద బాల శర్మ ప్రత్యేక పూజలు చేసి బోనాలను అమ్మవారికి సమర్పణ చేయించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని పలువురు మహిళలు, భక్తులు హాజరయ్యారు.

మహిమ గల తల్లి మహంకాళీ అమ్మవారు

ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి

గజ్వేల్ పట్టణంలోని మహాంకాళీ అమ్మవారు మహిమాన్విత దేవత అని ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి , మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా అన్నారు. ఆదివారం మహాంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆమ్మవారిని వారు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన వారు మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను అమ్మవారు కాపాడుతుందన్న విశ్వాసం భక్తులతో ఉందన్నారు. ప్రత్యేక బోనం సమర్పణతో అమ్మవారు శాంతించి ప్రజలను ఆపదలు, అనారోగ్యం నుంచి రక్షించటంతోపాటు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని పూర్వీకులు చెప్పినట్లు ఇప్పటికీ ప్రజలు అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలమణి,తలకొక్కుల బాగ్యలక్ష్మీ దుర్గాప్రసాద్, బొగ్గుల సురేష్, సమీర్,తూం శ్రీధర్,తలకొక్కుల లక్ష్మణ్,జంగం రమేష్, గడియారం స్వామిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News