Sunday, December 22, 2024

వైభవంగా మైసమ్మ బోనాలు

- Advertisement -
- Advertisement -

జిల్లేడుచౌదరిగూడెం: మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో మైసమ్మ బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ద్ధలతో మహిళలు అమ్మ వారికి బోనాలు సమర్పించుకున్నారు. పోతరాజుల విన్యాసాల మధ్య గ్రామంలోని వీధులగుండా బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయం వద్దకు చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అదేవిధంగా గ్రామంలోని దళితవాడలోని మైసమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. బోనాల వేడుకలో గ్రామ పెద్దలు,ప్రజలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News