Monday, December 23, 2024

వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో, సరస్వతి శిశు మందిరంలో, లక్ష్మి పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మా సం రెండవ శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మెన్ జూలూరి రమేష్ బాబు, వెంకటేశ్వర దేవాలయంలో ఆలయ చైర్మెన్ కల్వ మనోహర్, సరస్వతి శిశు మందిరంలో పాఠశాల ప్రధానాచార్యులు కండే కృష్ణమోహన్, పూజారులు లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వా సవి క్లబ్ అధ్యక్షుడు చిదిరె శ్రీనివాసులు, శిశు మందిరం కార్యదర్శి గుగ్గిళ్ల శం కర్, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల నాయకులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News