- Advertisement -
అఫ్ఘనిస్తాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 5.49 గంటల సమయంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంస్థ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది.అప్ఘనిసాన్ లోని తూర్పు కాబుల్ కు 85 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. భూకంప ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
గత సోమవారం కూడా అప్ఘనిస్తాన్ లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా… వంద మందికిపైగా గాయపడ్డారు.
- Advertisement -