Friday, December 20, 2024

కంపించిన పశ్చిమ అఫ్ఘనిస్థాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పశ్చిమ అఫ్ఘనిస్థాన్‌లో శనివారం పలు తీవ్రస్థాయిలో భూమి కంపించింది. అనంతర ప్రకంపనలు కూడా చోటుచేసుకున్నాయి. హెరాత్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ పరిణామంలో కనీసం 15 మంది చనిపోయినట్లు, దాదాపు 40 మంది వరకూ గాయపడ్డట్లు విపత్తు నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు. రెక్టర్ స్కేలుపై రెండుసార్లు 6.3 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. ఈ పరిణామం తరువాత హెరాత్ నగరంలో కనీసం ఐదు అనంతర తీవ్రస్థాయి ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక పౌరుడు ఒక్కరు తెలిపారు. భూకంప తీవ్రత 6.3గా ఉన్నట్లు యుఎస్ జియాలాజికల్ సర్వే నిర్థారించింది. హెరాత్ నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో వాయవ్య ప్రాంతంలో భూకంప కేంద్రం నెలకొని ఉందని యుఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది.

తరువాత వరుసగా సంభవించిన ఏడు భూకంపాలు కూడా తీవ్రస్థాయివి కావడంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం అయింది. భూకంప తాకిడి, తరువాత తిరిగి ఎప్పుడు భూమి కంపిస్తుందో తెలియని స్థితిలో ప్రజలు అత్యధికంగా ఇండ్లు వాకిళ్లు వీడి , వీధులలోనే ఉంటున్నారు. ఆఫీసులు దుకాణాలు అన్ని మూతపడ్డాయి. ఈ భూకంప తీవ్రతలో ఎందరు చనిపోయ్యారని, నష్టం వివరాలపై అధికార తాలిబన్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. హెరాత్ ప్రాంతం ఇరాన్‌కు సరిహద్దులలో ఉంది. భూకంపం తరువాత ఫోన్లు అన్నిపనిచేయకుండా పొయ్యాయి. దీనితో దెబ్బతిన్న ప్రాంతాలలో పరిస్థితి గురించి వివరాలను వెంటనే రాబట్టలేకపోతున్నారు. ఫరాహ్, బగ్దీస్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.

2022లో వేయి మంది బలి, వేలాదిగా నిరాశ్రయం
అత్యంత నిరుపేదలు, తరచూ కల్లోలిత ప్రాంతం అయిన అఫ్ఘనిస్థాన్‌లో 2022 జూన్‌లో పర్వతమయం అయిన తూర్పు ప్రాంతంలో పెను భూకంపం సంభవించింది. అప్పట్లో దాదాపు 1000 మంది వరకూ చనిపోగా, 1500 మంది గాయపడ్డారు. ఇది రెండు దశాబ్దాలలో అత్యంత భయానక భూకంపంగా రికార్డుల్లోకి వెళ్లింది. ఈ ప్రాంతంలో ఉండే వేలాది రాతి, ఇటుకలతో కూడిన ఇళ్లు చాలా వరకూ ధ్వంసం అయ్యాయి. ఇప్పటికీ ఈ బాధితులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News