- Advertisement -
దుషాన్‌బే: తజికిస్థాన్‌లో గురువారం 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో కూడా ప్రభావం చూపింది. సరిహద్దు వెంబడి భూమి కంపించిందని, కానీ ప్రాణనష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందనట్లు ఈ ప్రాంతంలోని అధికారి జిన్హువా వార్త సంస్థతో చెప్పారు. ప్రస్తుతానికి కష్గర్‌లో విద్యుత్ సరఫరా మామూలుగా ఉంది. కష్గర్, సమీప ప్రాంతాలలోని అనేక కౌంటీలు, నగరాలు భూకంప కేంద్రం 300 కిమీ. వ్యాసార్థంలో ఉన్నాయి.
చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం(సీఈఎన్‌సి) ప్రకారం ఉదయం 8.37 గంటలకు భూకంపం సంభవించింది. సీఈఎన్‌సి ప్రకారం భూకంప కేంద్రాన్ని 37.98 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 73.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో 10 కిమీ. లోతులో ఉన్నట్లు కనుగొన్నారు.
- Advertisement -