Thursday, January 23, 2025

ఫ్రాన్స్‌లోని న్యూ కలెడోనియాలో 7.7 తీవ్రతతో భూకంపం

- Advertisement -
- Advertisement -

న్యూ కలెడోనియా: ఫ్రెంచ్ భూభాగంలోని న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్‌కు ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో భూకంపం శుక్రవారం సంభవించింది. దాంతో దక్షిణ పసిఫిక్‌లోని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వనాటు, ఫిజీ, న్యూ కలెడోనియాలకు సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం(పిటిడబ్లుసి) తెలిపింది. అయితే ఆస్ట్రేలియ వాతావరణ శాస్త్ర బ్యూరో దాని తూర్పు తీరంవలో లార్డ్ హోవ్ ద్వీపానికి ముప్పు ఉందని పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యుఎస్‌జిఎస్) భూకంపం దాదాపు 38 కిమీ. (24 మైళ్లు) లోతులో సంభవించిందని పేర్కొంది. ఇదిలావుండగా ఈ భూకంపం వల్ల తమ తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందా, లేదా అనేది ఇంకా అంచనా వేస్తున్నట్లు న్యూజిలాండ్ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News