- Advertisement -
వరల్డ్ ర్యాపిడ్ ఆండ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించిన చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ తీరుపై ఫిడె ఛీప్ ఎమిల్ స్కూటోవీక్సీ స్పందించారు. ‘కార్ల్‌సన్‌పై నిషేధం విధించలేదు. ఆయన పోటీల్లో పాల్గొనవచ్చు’ అని తెలిపారు. కాగా, శనివారం జరిగిన ఈ పోటీల్లో మాగ్నస్ జీన్స్ వేసుకొని కోడ్‌ను ఉల్లఘించాడు. దీంతో ఫిడె తనపై నిషేధం విధించిందని, అందుకే ఛాంపియన్ షిప్ నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించాడు కార్ల్‌సన్. దీనిపై ఫిడె స్పందిస్తూ.. ‘కార్ల్‌సన్‌పై నిషేదం విధించలేదు. అతను వేసుకున్న డ్రెస్‌ను మార్చువాలని చెప్పాం. ఆదివారం పోటీల్లో పాల్గొనవచ్చు. కానీ నిబంధనలు అందరికీ సమానమే. డ్రెస్ కోడ్‌ను అందరూ గౌరవించాల్సిందే. ఇది అథ్లెట్ కమిషన్ నిబంధన. ఈ కమిషన్ గ్రాండ్ మాస్టర్లతో కూడుకొన్నది’ అని తెలిపారు.
- Advertisement -