Sunday, January 19, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంటకు బెయిల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వ్యతిరేకించలేదు.

గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఇడి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. కాగా మంగళవారం మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మాత్రం ఇడి వ్యతిరేకించలేదు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఇడి ముందు హాజరుకావాలని రాఘవను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. చెన్నై వదిలి వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు షరతు విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఇడి అరెస్ట్ చేసిన విషయం విదితమే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఇడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News