Thursday, January 23, 2025

అమిత్ అరోరా ఎవరో నాకు తెలియదు: మాగుంట

- Advertisement -
- Advertisement -

అమరావతి: తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధంలేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.  అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మాగుంట పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమిత్ అరోరా ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇది సౌత్ ఇండియన్స్‌పై నార్త్ ఇండియన్స్ చేసే వ్యాపార కుట్ర అని మండిపడ్డారు. వ్యాపార కుట్రలో భాగంగానే నార్త్ ఇండియన్స్ ఇదంతా చేశారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలపై త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు.

సౌత్ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఇడి వెల్లడించింది. ఈ గ్రూపు ద్వారా రూ.వంద కోట్లను విజయ్‌నాయర్‌కు చేర్చినట్లు ఇడి తమ విచారణలో బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.  ఇడి చేసిన దర్యాప్తులో అమిత్ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాలను స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 36 మంది రూ.1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఇడి అధికారులు తెలిపారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి 33 ఫోన్లను మాయం చేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News