Sunday, January 12, 2025

రాజకీయాల్లో, వ్యాపారాల్లో నీతిగా ఉన్నాం: ఎంపి మాగుంట

- Advertisement -
- Advertisement -

Magunta is ethical in politics and business

అమరావతి: తమపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవని ఎంపి మాగుంట శ్రీనివాసు రెడ్డి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాము లేమని, 70 ఏళ్ల నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని చెప్పారు. 8 రాష్ట్రాలలో తమ వ్యాపారాలు ఉన్నాయని, ఎక్కడ మచ్చ లేని వ్యాపారాలు చేస్తున్నామన్నారు. మాకు చెన్నై, ఢిల్లీ వివాసాల్లో ఇడి దాడులు జరిగాయని, ఏ విధమైన ఆధారాలు, అక్రమాలు జరగలేదని ఈడి అధికారులు తేల్చారని, పంచనామాలో కూడా ఇదే రాశారని చెప్పారు. తమపైనే కాదు అని, దేశంలో 32 మంది వ్యాపారుల సంస్థలలో ఇడి సోదాలు చేసిందన్నారు. తమ కుటుంబం రాజకీయాల్లో, వ్యాపారాల్లో నీతిగా ఉన్నామని, ఎక్కడ అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవని మాగుంట  స్పష్టం చేశారు. 2024లో తన కుమారుడు ఒంగోలు ఎంపిగా పోటీ చేస్తారని వెల్లడించారు. ఇది కేవలం వ్యాపారపరమైన ఇడి దాడులుగానే భావిస్తున్నామని చెప్పారు. ఇడి దాడులు రాజకీయ దాడులు కావని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News