Monday, December 23, 2024

20న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం ఆదివాసి అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బయ్యారం మండలంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో బాలాజీ పేట. కోయగూడెం గ్రామాలలో ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు వస్తాయని ఆశపడ్డ పోడు రైతులకు కెసిఆర్ పాలనలోనిరాశ మిగిలిందని అన్నారు.

టైగర్ జోన్. అభయ అరణ్యాల పేరుతో ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించే కుట్రలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ ప్రభుత్వానికి సిద్ధ శుద్ధి ఉంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో నాయకులు తోకల వెంకన్న, మోకాళ్ళ రమేష్, బిరియాని ఏసుదాస్, కొత్త రాందాస్, ఎర్రమల్లె వెంకన్న, గుడిబైన రమేష్, గంగరబోయిన రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News