Sunday, April 6, 2025

నేడు భవ్య , వైష్ణవి ఆత్మహత్యలపై ఇందిరాపార్కు వద్ద మహాధర్నా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో మైనర్ బాలికలు భవ్య, వైష్ణవి ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ప్రజాసంఘాలు పోరు బాట పట్టాయి. అందులో భాగంగా సోమవారం ఇందిరాపార్కు వేదిక మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భవ్య, వైష్ణవి న్యాయ పోరాట కమిటీ నాయకులు ఇడబోయిన వెంకటేష్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమను ఆందోళనకు గురిచేసిందని, ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు, మహిళ సంఘాలు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తే పలు ఆసక్తికరణ విషయాలు బయటపడ్డాయన్నారు.

హాస్టల్ పరిధిలో ఉన్న పరిస్థితులను పరిశీలించిన నిజా నిర్ధారణ బృందానికి అది ఆత్మహత్య కాదు, మమ్ముటి హత్యనే అనే బలమైన ఆధారాలు లభించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల మృతి పై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించి వారి కుటుంబాలను న్యాయం చేయాలని కోరారు. అయినా పాలకులు నిర్లక్ష్యం చేస్తే న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాకు రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని బాధితులకు మద్దతు తెలపాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News