- Advertisement -
హైదరాబాద్ : జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జెఎన్‌జె మ్యాక్ హెచ్‌ఎస్) జర్నలిస్టులు పదహారేళ్ల క్రితం కొనుగోలు చేసిన పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సొసైటీకి కేటాయించాలని కోరుతూ ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ధ దర్నా చౌక్‌లో జర్నలిస్టులు మహాధర్నా నిర్వహించనున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటున్నట్టు జెఎన్‌జె హౌసింగ్ సొసైటీ ఫౌండర్ మెంబర్ పివి రమణారావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహాధర్నా జరుగుతుందన్నారు.
- Advertisement -