Monday, December 23, 2024

రూ. 360.40 కోట్లకు ముంబై గణేశుడి బీమా

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వినాయక విగ్రహంగా ప్రసిద్ధి పొందిన ముంబైలోని జిఎస్‌బి సేవా మండల్‌కు చెందిన మహా గణపతి ఉత్సవానికి ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 360.40 కోట్ల బీమా చేశారు.

ముంబై మహానగరంలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న జిఎస్‌బి గణేశ్ మండల్‌ను ఏటా౩ లక్షలాది మంది సామాన్యులు, సెలబ్రిటీలు సందర్శిస్తుంటారు. ఈ ఏడాది జిఎస్‌బి గణేశ్ మండల్ 69వ వార్షిక గణేశ ఉత్సవాలను నిర్వహిస్తోంది. గత ఏడాది రూ. 316.40 కోట్లకు గణేశ్ ఉత్సవాలను బీమా చేయించిన జిఎస్‌బి సేవా మండల్ ఈ ఏడాది బీమా సొమ్మును రూ. 44 కోట్లు పెంచింది. అయితే ఇందుకోసం ఎంత సొమ్మును ప్రీమియంగా చెల్లించిందీ ట్రస్టు యాజమాన్యం వెల్లడించలేదు.

మా గణేశ్ మండల్‌ను రూ. 360.40 కోట్లకు ఈ ఏడాది బీమా చేయించాము అని జిఎస్‌బి సేవా మండల్ ట్రస్టీ, అధికార ప్రతినిధి అమృత్ డి పాయ్ తెలిపారు.

ఇన్సూరెన్ కవర్ సమగ్రమైనదని, సాధ్యమైనంత వరకు అన్నింటినీ కవర్ చేస్తుందని ఆయన చెప్పారు.

బంగారం, వెండి, నగలతోసహా అన్ని వస్తువులు, ఆభరణాలనుఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలనీ(రూ.38.47) కవర్ చేస్తుందని ఆయన చెప్పారు.

ఫర్నీచర్, ఫిక్చర్స్, ఫిట్టింగ్స్, కంప్యూటర్లు, సిసిటివి కెమెరాలు, క్యుర్ స్కానర్లు, వంట పాత్రలు, బంట సామాన్లు, పండ్లు, కూరగాయలు వంటి వాటిని ది స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ విత్ ఎర్త్‌క్వేక్ రిస్క్(రూ. 2 కోట్లు) కవర్ చేస్తుంది.

మండపాలు, స్టేడియాలు, భక్తులను ది పబ్లిక్ లైబిలిటీ పాలసీ(రూ. 30 కోట్లు) కవర్ చేస్తుంది.

వాలంటీర్లు, ప్రచారక్‌లు, వంటవాళ్లు, గడీలు, చెప్పుల స్టాళ్ల కార్మికులు, వాలెట్ పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను ది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్(రూ.289.50 కోట్లు) కవర్ చేస్తుంది.

మండపం వేదికను, ప్రాంగణాన్ని ది స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ(రూ. 42 కోట్లు) కవర్ చేస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News