Saturday, November 23, 2024

బుధవారం నుంచి మహారాష్ట్రలో పూర్తి లాక్‌డౌన్?

- Advertisement -
- Advertisement -

ముంబయి: భారీ ఎత్తున కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్రలో పూర్తి లాక్‌డౌన్ విధించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై రాష్ట్రమంత్రులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేయడానికి బుధవారం నుంచి రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించాలని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కోరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మంగళవారం చెప్పారు. దీనిపై నిర్ణయం తీసుకోవలసింది ముఖ్యమంత్రేనని కూడా ఆయన చెప్పారు. కాగా రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్‌కు కొరత ఏర్పడడం చూసిన తర్వాత రాష్ట్రం పూర్తి లాక్‌డౌన్‌కు చేరువైందనిపిస్తోందని, త్వరలోనే దీనికి సంబంధించి మార్గ దర్శకాలను విడుదల చేయడం జరుగుతుందని మరో మంత్రి అస్లాం షేక్ చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ముఖ్యమంత్రి బుధవారం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన రాష్ట్రప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. కిరాణా సరకులు, కూరగాయలు,పండ్లు, ఇతర నిత్యావసర దుకాణాలు కేవలం నాలుగు గంటల పాటే తెరవాలని ఆదేశించింది. అలాగే రాత్రి 8 గంటల తర్వాత హోం డెలివరీని నిలిపి వేసింది. మాంసం దుకాణాలు సహా అన్ని ఆహార సరకుల దుకాణాలు ఉదయం 7నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని, ఉదయం 7నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే హోం డెలివరీ చేయాలని రాష్ట్రప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Maha Govt may impose complete lockdown?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News